2014 పార్లమెంట్,శాసనసభ ఎన్నికల లో వినియోగించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు మొత్తం 8691 లను బెంగుళూరు బీఈఎల్ సంస్థకు కు పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న ఈవీఎం గోదాములో భద్రపరచిన ఈ యూనిట్ల గదులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీళ్లను తొలగించి రికార్డుల ప్రకారం పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సంతకాలు తీసుకుని, ఆయా యూనిట్ల బాక్సులను తెరిచారు. జనగామ, మహబూబాబాద్ ,డోర్నకల్, ములుగు, నర్సంపేట నియోజకవర్గ ము లకు చెందిన ఈ యూనిట్లను పోలీసు ఎస్కార్ట్ తో బెంగుళూరుకు పంపారు. మిగిలిన నియోజకవర్గ ము ల ఎన్నికలపై ఫిర్యాదులు ఉన్నందున బీయూ, సీయూ లను ఇక్కడే ఉంచుతున్నారు. ఈ కార్యక్రమoలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కిరణ్ ప్రకాశ్.తెరాస నుండి డాక్టర్ ఇండ్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుండి ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు