Highlights
- ఏపీలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
- కేసీఆర్ స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా నేతలు పోరాడాలి
- కేసీఆర్ అభిమాని ఖాదీర్
ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏపీలో కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది.గుంటూర్ జిల్లా తెనాలిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమాని ఖాదీర్ కేక్ కట్ చేశారు పట్టణంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని ఖాదీర్ చాటుకున్నారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ దృష్టిలో గొప్ప హీరో అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసి.. తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రా నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే కేసీఆర్ జన్మదిన వేడుకలను ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు.
గుంటూర్ జిల్లా తెనాలిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమాని ఖాదీర్ కేక్ కట్ చేశారు పట్టణంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని ఖాదీర్ చాటుకున్నారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ దృష్టిలో గొప్ప హీరో అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసి.. తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రా నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.