YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

26న జనసేన తొలి జాబితా..?

26న జనసేన తొలి జాబితా..?
జనసేన పార్టీ తన అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ నెల 26న తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో విశాఖ పట్నంపై అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందున తొలిజాబితాలో ఈ జిల్లా అభ్యర్థులు కూడా వుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 15 నియోజక వర్గాలు వుండగా అందులో కనీసం నాలుగైదు స్థానాలకైనా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉందంటున్నాయి. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబు పోటీ పడుతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు ఎం.రాఘవరావు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలోను కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి అక్కడ పోటీ ఎవరూ లేరు. అయితే కొత్తగా ఎవరైనా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.విశాఖ పశ్చిమ టిక్కెట్‌ డాక్టర్‌ సునితి, పీవీ సురేశ్‌ ఆశిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి గుంటూరు భారతి, పసుపులేటి ఉషాకిరణ్‌ రంగంలో ఉన్నారు. వీరు కాకుండా కాపునేత ముద్రగడ పద్మనాభం శిష్యుడు తోట రాజీవ్‌ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఎక్కువ పోటీ ఉంది.విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి వైసీపీ నుంచి వచ్చిన గంపల గిరిధర్‌, రాహుల్‌ టిక్కెట్లు ఆశిస్తున్నారు. భీమిలి నుంచి విద్యాసంస్థల అధినేత అలివర్‌ రాయ్‌తో పాటు ముత్తంశెట్టి కృష్ణారావు పేరు వినిపి స్తోంది. పెందుర్తి నుంచి ప్రస్తుతానికి మండవ రవికుమార్‌ ఉన్నారు. ఇంకా మరికొందరు పార్టీలోకి వచ్చే అవకాశం వుందని, అభ్యర్థి ప్రకటనకు కొంత సమయం పడుతుం దని చెబుతున్నారు. గాజువాకకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి ఉన్నారు. వీరిలో చింతలపూడి పేరు బాగా వినిపిస్తోంది. అనకా పల్లి ఎంపీ స్థానానికి కూడా ముత్తంశెట్టి కృష్ణారావు పేరు పరిశీలనలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి సీతారామ్‌ పేరు వినిపిస్తోంది. అయితే సీనియర్‌ నేత దాడి వీరభద్రరావును స్వయంగా పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు.ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా ఆయన నిర్ణయంపైనే అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. ఇక నర్సీపట్నం నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తవారు వచ్చే అవకాశం వుందని సమాచారం. చోడవరం నుంచి పీవీఎస్‌ఎన్‌ రాజు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకెవరూ పోటీ లేరు. ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, మాడుగులకు పూడి మంగపతిరావుల పేర్లు వినిపిస్తున్నాయి. పాయ కరావుపేటకు నక్కా రాజారావు, శివదత్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఏజెన్సీలో మాజీ మంత్రి బాలరాజు అరకు పార్లమెంటుకు గానీ, పాడేరు అసెంబ్లీకి గాని పోటీ చేయాలని భావిస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గానికి గంగులయ్య ప్రయత్నిస్తున్నారు.

Related Posts