జన్మభూమి కార్యక్రమాలకు ప్రజల్లో అద్భుత స్పందన ఉంది. మరింత ఉత్సాహంగా అధికార యంత్రాంగం పని చేయాలి. అన్నివర్గాల ప్రజల అభిమానం పొందాలి. గ్రామ,వార్డు సభల్లో అభివృద్ధి ప్రణాళికలపై చర్చించాలి. అందరూ వాటిని ఆమోదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా అన్నారు. మంగళవారం అయన జన్మభూమి-మా వూరు 7వ రోజుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. సీఎస్ మాట్లాడుతూ ప్రణాళికలపై కార్యాచరణకు సిద్ధం కావాలి. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలి. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. జన్మభూమిలో పశువైద్య శిబిరాలకు స్పందన బాగుంది. లక్షలాది పశువులకు వైద్యం అందిస్తున్నాం. వీటిని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలి. కరవు నివారణ చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలి. నీటి ఎద్దడి ఉన్నచోట్ల తాగునీటిని సరఫరా చేయాలి. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. గ్రామాల్లో పశుగ్రాస సాగు ముమ్మరం చేయాలి. పశుగ్రాసం పంపిణీ చేయాలి. రంగుమారిన ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అన్నారు. సక్రమంగా ధాన్యం కొనుగోళ్లు జరపాలి. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపాం. అవసరాన్నిబట్టి రైతులకు ఇన్ పుట్ సబ్సిడి ఇవ్వాలి. అంగన్ వాడి కేంద్రాల నిర్వహణలో రాష్ట్రానికి 4అవార్డులు వచ్చాయి. అందులో 2అవార్డులు కృష్ణా జిల్లాకే వచ్చాయని అన్నారు. అంగన్ వాడి నిర్వహణలో దేశానికే నమూనాగా ఉండాలని అన్నారు.