హైదరాబాద్ గోషామహల్ స్టేడియం లో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ప్రారంభమయింది. ప్రీ రీక్యూట్ మెంట్ కోసం అవుట్ డోర్ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే సిటీ పోలీసులు 4 వేల మందిని సెలెక్ట్ చేసి పోలీస్ ఉద్యోగాలు కోసం శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం నాడు శిక్షణ శిబిరాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి కానిస్టేబుల్, ఎసై సెలెక్షన్ కి ప్రీ రీక్యూట్ మెంట్ నిర్వయించాం. కొత్త అభ్యర్థులు పోలీస్ కావాలను కొనే వారికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. మహిళలు కి 30 % రిజర్వేషన్ ఉంది. మొత్తం ఇప్పటికే 4 వేల మందిని ప్రీ రీక్యూట్ చేసుకున్నాం. సెలెక్ట్ అయిన వారిక్ ఇన్ డోర్ ,ఔట్ డోర్ లో శిక్షన ఇస్తున్నామని వెల్లడించారు. తాము ఇచ్చే శిక్షణ తీసుకొని 80 % మంది ఉద్యోగం తెచ్చుకున్నారు. పోలీస్ శాఖ ఇచ్చే ఉచిత శిక్షణ కి మంచి స్పందన వస్తుంది. మహిళలు ఎక్కువగా పోలీస్ ఉద్యోగం లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అయన అన్నారు.