YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లర్ల ఆరెస్టు కోటీ 7 5లక్షల విలువచేసే ఎర్రచందనం స్వాధీనం

ఎర్రచందనం స్మగ్లర్ల ఆరెస్టు  కోటీ  7 5లక్షల విలువచేసే ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా చాటు మాటుగా జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను జిల్లా పోలీసులు ఛేదించారు. దక్కిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు మంది స్మగ్లర్లను, వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఐదు మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసారు. ఇందులో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు . వీరి వద్ద  నుండి 122 ఎర్రచందనం దుంగలు, 2 మినీ లారీలు, మూడు ద్విచక్ర వాహనాలు,  యాభై వేలు విలువ చేసే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు కోటి 75 లక్షల రూపాయలు వుంటుంది. మంగళవారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స హోల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య మాట్లాడుతూ  ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. వెంకటగిరి డక్కిలి పోలీసులు ఎంతో కష్టపడి ఈ స్మగ్లర్లను పట్టుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరగడానికి కారణం చైనా, సింగపూర్ ,మలేషియా, జపాన్ ,హాంగ్ కాంగ్, అరబ్ దేశాలలో ఎక్కువ డిమాండ్ ఉండటమే  అన్నారు. అక్కడ ప్రజలు ఎర్రచందనం తయారుచేసిన వస్తువులకు అధిక శక్తులు ఉంటాయని భావిస్తారు. అందువల్ల ఆయా దేశాలలో ఎర్ర చందనానికి డిమాండ్ ఎక్కువ అని ఎస్పీ తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుండి సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఆంధ్ర ప్రదేశ్ నుండి వివిధ దేశాలకు తరలిపోయినట్లు ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో అటవీ విస్తీర్ణం ఇరవై ఒక్క శాతం 5 శాతం మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిపారు.

 

Related Posts