YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Highlights

  • ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలి 
  • కేసీఆర్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
 కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలతో పాటు పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా.. ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కేక్స్ కట్ చేసి.. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 


రాష్ట్రపతి...
సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. . 

సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

 కడియం శ్రీహరి..

 తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొట్లాడి సాధించిన తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా, సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన అలుపెరుగని కృషివలుడు మన కేసీఆర్ అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని పదే, పదే చెప్పే సీఎం కేసీఆర్ ఇక్కడి మానవ వనరుల అభివృద్ధికోసం విద్యారంగాన్ని సమూలంగా మార్చే మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు. 
సీఎం కేసీఆర్ ఆశించినట్లు తెలంగాణ విద్యారంగాన్ని దేశంలో అందరూ ప్రశంసించే విధంగా అత్యంత నాణ్యమైన విద్యగా, ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తీర్చిదిద్ధి ఆయనకు నిజమైన జన్మదిన కానుకగా అందిస్తామన్నారు. ఇంతటి స్ఫూర్తిని అందిస్తూ మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు అందించాలని ప్రార్థిస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

సీఎం కేసీఆర్ కు యువ్ న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు యువ్ న్యూస్ యాజమాన్యం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ . ఆయురారోగ్యాలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితం కావాలని ఆకాంక్షించింది.

Related Posts