YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మార్చి 23 నుంచే ఐపీఎల్

మార్చి 23 నుంచే ఐపీఎల్
ఎన్నికల కారణంగా వచ్చే సీజన్లో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలకు బీసీసీఐ బ్రేక్ వేసింది. 12వ సీజన్ ఐపీఎల్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించనున్నట్టు క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికా తరలిస్తారని వార్తలొచ్చాయి. కానీ మన దేశంలోనే టోర్నీ నిర్ణయించాలని బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. ప్రాథమికంగా చర్చించిన అనంతరం 12వ ఎడిషన్ ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. విస్తృతమైన చర్చల అనంతరం ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బీసీసీఐ తెలిపింది. మార్చి 23న టోర్నీ ప్రారంభమవుతుందని, పూర్తి షెడ్యూల్‌ను సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విడుదల చేస్తామని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి 2009లో టోర్నీ సౌతాఫ్రికాలో జరిగింది. ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం ఇండియాలో జరిగింది. ఈసారి కూడా అదే జరగనుందని వార్తలు వచ్చాయి. ఇక మార్చిలో ఐపీఎల్ మొదలవడం ఇది కేవలం రెండోసారే. 2010లో తొలిసారి టోర్నీని మార్చిలోనే ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడుతున్నారు. అయితే ఈసారి మే 30 వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజుల గ్యాప్ ఉండేలా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

Related Posts