జనసేన, లెఫ్ట్ పార్టీ నేతలు మంగళవారం జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన అభ్యర్థుల జాబితాపై వారి మధ్య గంటపాటు చర్చ జరిగింది. ఎక్కడెక్కడ ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలన్నదానిపై ఇరు పక్షాల మధ్య ప్రాథమికంగా ఓ అవగాహన కుదిరినట్లు సమాచారం. మొత్తం 175 నియోజకవర్గాల్లో జనసేన, వామపక్షాల నేతలు పోటీ చేయడం, అలాగే ఆయా నియెజక వర్గాల్లో కేడర్‌ను పెంచుకో్వడం తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ముగిసిన అనంతరం ఇరు పార్టీల నేతలు పవన్ కల్యాణ్ నివాసానికి బయలుదేరి వెళ్లారు.