YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వేడి

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వేడి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. తెలుగేదేశం పార్టీ నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ నేతలు పోలీస్ శాఖను ఆశ్రయించారు. మంగళవారం డీజీపీని కలిసేందుకు ఏపీ బీజేపీ నేతలు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓ మహిళ నేతపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. చంద్రబాబుపై వెంటనే బైండోవర్‌ నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఇప్పటికే రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ టీడీపీ బీజేపీని ఏకధాటిగా ఉతికి ఆరేస్తుంది. అయితే ఇటీవల కాకినాడలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. బీజేపీ మహిళానేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఫినిష్ అయిపోతావ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబును కాకినాడలో అడ్డుకోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించారు టీడీపీ నేతలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే బీజేపీ, టీడీపీల మధ్య మాటల రాజకీయ పోరు ఇంకెంత వరకు వెళ్తుందో వేచి చూడాలి.

Related Posts