ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెరీర్లోనే అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఈ కమ్రంలో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఫరూక్ ఇంజినీర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సంపాదించాడు. ఆసీస్‌తో సిరీస్‌లో అంచనాలకు మించి రాణించిన పంత్.. 59వ స్థానం నుంచి 17వ స్థానానికి ఎగబాకాడు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయిన ఫరూక్ ఇంజినీర్ కూడా 1973లో 17వ ర్యాంక్ సాధించాడు. ఆసీస్‌తో సిరీస్ ముగిశాక పంత్ రేటింగ్ పాయింట్స్ 673కి చేరాయి. భారత వికెట్ కీపర్ సాధించిన అత్యధిక రేటింగ్ పాయింట్లు ఇవే కావడం గమనార్హం. 662 రేటింగ్ పాయింట్లతో ధోనీ తర్వాతి స్థానంలో ఉండగా.. ఫరూక్ ఇంజినీర్ 619 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 19వ స్థానానికి చేరుకోవడమే ధోనీకి అత్యుత్తమ ర్యాంకింగ్. పంత్ తన 9వ టెస్టు మ్యాచ్‌తోనే టాప్-20లోకి అడుగుపెట్టాడు. సిడ్నీ టెస్టులో వేగంగా 159 రన్స్ చేసిన పంత్.. భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఈ సిరీస్‌లో 350 పరుగులు చేయడంతోపాటు 20 క్యాచ్‌లు అందుకున్న రిషబ్.. అనేక రికార్డులను బ్రేక్ చేశాడు.