YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

పాపం అంతా కాంగ్రెస్‌దే..

Highlights

  • నీరవ్ మోదీని పట్టుకునితీరతాం
  • కాంగ్రెస్ నేతలకు నీరవ్ కంపినీలో షేర్లున్నాయి
  • కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 
పాపం అంతా కాంగ్రెస్‌దే..

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ దేశం విడిచిపారిపోయినా, పట్టుకుని తీరతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు..ఆయన్ను అరెస్టు చేసేందుకవసరమైన  అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పంజాబ్‌ నేషనల్‌  బ్యాంకులో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంపై కేంద్ర ప్రభు‍త్వాన్ని రక్షించే పనిలో పడ్డారు.శనివారం  ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. నీరవ్ మోదీ సహా అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేయారు. కుంభకోణాలకు పాల్పడిన  క్షమించే ప్రసక్తే లేదనీ,  శిక్షించి తీరుతామన్నారు.ఈ స్కాంలో అసలు పాపం అంతా కాంగ్రెస్‌దేనని, దాన్ని కప్పిపుచ్చుకోడానికే బీజేపీపై ఎదురు దాడిచేస్తున్నారని దుయ్యబట్టారు.  వారసత్వ, వారసత్వ ఆస్తులు  అన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవని ఆమె ఆరోపించారు. 

 కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి భార్యకు భార్య అనితా సింగ్‌కు  నీరవ్ మోదీ‌కి చెందిన కంపెనీలో షేర్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. దావోస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార వేత్తలతో  దిగిన ఫోటోలో డైమండ్‌ వ్యాపారి నీరవ్‌మోదీ ఉండటంపై విమర్శలకు దిగిన కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.  ఈ విషయంలో కాంగ్రెస్  అవాస్తవాలు చెబుతోందన్నారు.నీరవ్‌ మోదీ కంపెనీలలో ఒకటైన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనితా సింఘ్వి ,(కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి భార్య) , కుమారుడు  అవిష్కార్ సింఘ్వి  డైరెక్టర్లుగా ఉన్న  అద్వైతా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్ హోల్డింగ్స్  స్థలాన్ని 2002 నుంచి  అద్దెకు ఇచ్చారని, రెండు కంపెనీల మధ్య రుణ లావాదేవీలు  జరిగాయని పేర్కొన్నారు.

ఇందులో ప్రమోటర్లుగా  కాంగ్రెస్‌వారే లబ్ధి దారులుగా ఉన్నారని ఆరోపించారు.  గీతాంజలి ఆభరణాల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  పాల్గొన్నవిషయాన్నిగుర్తు చేసిన ఆమె రాహుల్‌పై తన దాడిని ఎక్కుపెట్టారు. 
  
 

 

Related Posts