హీరో శివాజీ మరో బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాధికారులపైనే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అధికారులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రైతులు విద్యుత్ సమస్యతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూ సమస్యలు అన్ని రాష్ట్రాల్లో ఉంటాయన్నారు. ప్రస్తుత అధికారులు మాత్రం పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చుక్కలు భూములు, అసైన్డ్ భూములను పేదలకు ఇవ్వాల్సిందేన్నారు. నిషేధిత భూముల పేరుతో అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులపైనే తనకు అనుమానాలున్నాయన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అధికారులే గందరగోళం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందన్నారు. ఈనెలాఖరుకు సమస్య తేలకపోతే అధికారుల పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఏపీలో దాదాపుగా 12 లక్షల ఎకరాల చుక్కలు భూములున్నాయని పేర్కొన్నారు. ఈ భూముల వల్ల 30 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు