నెల్లూరు వెళ్లే నిమిత్తం ఢిల్లీ నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం 3:45 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు కు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి, జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న లు ఘన స్వాగతం పలికారు. తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ విజయరామ రాజు, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ అనిల్ బాబు, డిఎస్పీ లు గంగయ్య, చంద్రశేఖర్, ఏయిర్ పోర్టు అధికారులు రాజశేఖర్ రెడ్డి, సిఐఎస్ఎఫ్ అధికారులు, నాయకులు కోలా ఆనంద్ తదితరులు కూడా ఉపరాష్ట్రపతి కి స్వాగతం పలికారు. అనంతరం, ఉపరాష్ట్రపతి తన వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అధికారులతో కలిసి గట్టి భద్రత నడుమ రేణిగుంట ఏయిర్పోర్టు నుండి ప్రత్యేక కాన్వాయ్ వాహన శ్రేణిలో రేణిగుంట రైల్వే స్టేషన్ 5వ ఫ్లాట్ ఫార్మ్ వద్ద కు నేరుగా వెళ్లి అక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే వారు సిద్ధంగా ఉంచిన ప్రత్యేక ఏసీ రైలు ఎక్కి నెల్లూరు బయలుదేరి వెళ్లారు. మంత్రి అమరనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కుల్ శ్రేష్ఠ, గుంతకల్ డిఆర్ఎం విజయ్ ప్రతాప్ సింగ్, తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ అధికారులు, ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యురిటి కమీషనర్ ఉదయసింగ్ పవార్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ శివప్రసాద్ తదితరులు ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారికి రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం, సాదర వీడ్కోలు పలికారు.
తిరుగు ప్రయాణంలో భాగంగా, ఉప రాష్ట్రపతి గారు నెల్లూరు నుండి బుధవారం సాయంత్రం ప్రత్యేక రైలులో బయలుదేరి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వచ్చి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు.