YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డీఎన్ఏ టెక్నాలజీ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

డీఎన్ఏ టెక్నాలజీ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం
డీఎన్ఏ టెక్నాలజీ నియంత్రణ బిల్లు-2018కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. డీఎన్ఏ ఆధారిత ఫోరెన్సిక్ టెక్నాలజీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. నేర‌స్థుల‌ను గుర్తించ‌డంతో పాటు త‌ప్పిపోయిన వారిని డీఎన్ఏ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నారు. ట్రాన్స్‌ఫ్లాంటేష‌న్‌(అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో)ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లిన‌.. మ‌న దేశానికి వ‌చ్చిన విదేశీయులు, శ‌ర‌ణార్థుల‌ను సుల‌భంగా గుర్తించేందుకు ఈ సాంకేతిక‌త‌ను వినియోగించ‌నున్నారు. ముఖ్యంగా క్రిమిన‌ల్, సివిల్ కేసుల్లో నిందితుల‌ను గుర్తించేందుకు ఇక‌పై ఈ టెక్నాల‌జీని వాడ‌నున్నారు.మ‌రోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలను కూడా సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను గుర్తించేందుకు కూడా డీఎన్ఏ ఆధారిత టెక్నాలజీ తోడ్పతుంది. లోక్‌స‌భ‌లో చర్చ సంద‌ర్భంగా ఓ ప్ర‌శ్న‌కు సమాధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. కేవలం ఒక శాతం కంటే తక్కువ శాతం వ్యక్తులపై డీఎన్ఏ పరీక్ష జరుగుతోందని వివ‌రించారు.

Related Posts