విజయవాడ టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తం ఇక్కడి మూడు స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ చాలా బలంగా ఉంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా గెలుపు గుర్రం ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. తూర్పులో అయితే, అభ్యర్థిని మార్చినా టీడీపీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నతూర్పులో ఆది నుంచి కూడా కమ్మ వర్గానికి చెందిన నేతలే ఇక్కడ గెలుపు గుర్రంఎక్కుతున్నారు. 2004లో మాత్రమే వంగవీటి రాధా విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.సెంట్రల్ విషయానికి వస్తే.. కాపు వర్గానికి చెందిన బొండా ఉమా గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. చిన్న పాటి ఆరోపణలు మినహా.. ఆయన పనితీరుపై ప్రజలు సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, కమ్యూని టీ హాళ్ల నిర్మాణం, సామాజిక ఫింఛన్ల నమోదు, ప్రబుత్వ కార్యక్రమాల అమలు వంటి విషయాల్లో బొండా ముందున్నారు. క్లాస్, మాస్ కలగలిసిన ఈ నియోజకవర్గంలో బొండాకు మంచి ఫాలోయింగ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పట్ల ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సిందే. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో టీడీపీలో బొండాకు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణును వైసీపీ రంగంలోకి దించితే గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.మూడో నియోజకవర్గం విజయవాడ వెస్ట్. ఇక్కడ టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయంలోనే తీవ్రమైన సస్పెన్స్ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీతరఫున గెలుపొందిన జలీల్ ఖాన్ తర్వాత టీడీపీలో చేరిపోయారు. అయితే, ఈయన.. టీడీపీలో క్షేత్రస్థాయిలో పుంజుకోలేక పోయారు. ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో స్థానికంగా టీడీపీ నేతలకు ఆయనకు మధ్య దూరం గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇక, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవాలని జలీల్ భావిస్తున్నారు. అయితే, ఆమెకు కూడా ఇక్కడి శ్రేణులు కలిసివచ్చేలా కనిపించడం లేదు. టీడీపీ సీనియర్, నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఈ సీటుకు పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈయన అభ్యర్థిత్వానికి చంద్రబాబు ఓకే చెబుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఈయన పేరు మళ్లీ వెనక్కి వెళ్లింది. ఈ సస్పెన్స్ వీడి.. బుద్దాకు టికెట్ కనుక ప్రకటిస్తే వెస్ట్‌లో కూడా టీడీపీ గట్టి పోటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటకి అయితే సెంట్రల్, తూర్పులో బలంగా ఉన్న టీడీపీ వెస్ట్ సీటు విషయంలో కూడా అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ వీడితే నే అసలు సంగతి తెలిసి పోతుంది.