YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాలుకా పోలీసు స్టేషన్ ప్రారంభించిన హోం మంత్రి నిమ్మకాయల

తాలుకా పోలీసు స్టేషన్ ప్రారంభించిన హోం మంత్రి నిమ్మకాయల
రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. బుధవారం నగర శివారు ప్రాంతంలోని రాయలసీమ యూనివర్సీటీ సమీపంలో 1.42 కోట్లతో నిర్మించిన నూతన కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కె.ఇ.కృష్ణమూర్తిలు ప్రారంభించారు. కర్నూలు పార్లమెంటు  సభ్యులు బుట్టారేణుక, ఎమ్మెల్సీ కె.ఇ ప్రభాకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మల్లెల రాజశేఖరు, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎస్. మోహన్ రెడ్డి, మణి గాంధీ, డిఐజి నాగేంద్ర కుమార్, జిల్లా కలెక్టర్  ఎస్. సత్యనారాయణ, ఎస్పి పక్కీరప్ప, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గొర్రెల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్యక్షులు నాగేశ్వరయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిష్ట్ర హోమ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వత రాష్ట్రంలోని లెక్నాలజీతో కూడిన మౌలిక వపతుల ఏర్పాటులో నూతన పోలీసు స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. దీంతోపాటు అవనరమైన వాహనాలు, పోలీసు ఉద్యోగాల ఖాళీల భర్తీ చేసుకుంటూ శాంతి  భద్రతలను పరిక్షిస్తున్నమన్నారు. కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పి స్థాయి వరకు అర్హత మేరకు పదోన్నతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. గత నాలుగున్నార ఏళ్ల నుండి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి లా అండ్ ఆర్డరును అమలు చేస్తూ క్రైయిం రేటును తగ్గించామన్నారు. జిల్లాలో ఫ్యాక్షనును నియంత్రించడడంతో పాలు రకరకాల నేరాలను ఆదుపు చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగంలో చేరే కానిస్టేబుళ్లకు సాంకేతికతో కూడిన శిక్షన ఇచ్చి ప్రజలతో ప్రేమగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతున్నాయన్నారు. శాంతి భద్రతలు  పటిష్టంగా  వుంటేనే పరిశ్రమలు రావడం, అభివృద్ది చెందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ  కృష్ణమూర్తి  మాట్లాడుతూ దేశం మార్పు కోరుతుందని ఆ క్రమంలో భాగంగానే రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకపోతుందన్నారు. కానిస్టేబుళ్ల నుంచి ఎస్,  డిఎస్పి స్థాయిల వరకు త్వరత్వరగా పదోన్నతులు వస్తున్నాయన్నారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రాంతంలో కుటుంబాలు,  జనాభా విపరీతంగా పెరిగిపోతుందని అందుకు తగ్గట్టుగానే ఆయా పరిధిలో తాలుకా  పోలీసు స్టేషన్ నిర్మాణం జరిగిందన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి శాంతి భద్రతను  పటిష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మౌళిక వపతుల్లో  మార్పులు తీసుకరావడంతో ప్రశాంత వాతావరణం కనిపిస్తోందని అన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్మాణానికి స్థలం కల్పించిన రాయలసీమ యూనివర్పీటి వైప్ ఛాన్సలరు ప్రసాదరావును మంత్రులు శాలువ కప్పి సన్మనించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పి మాధవ రెడ్డి,  డిఎస్పిలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts