రామాయపట్నం పోర్టు నిర్మాణం తో ప్రకాశం జిల్లా ప్రజల కల నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం . ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పోర్టు మైనర్ పోర్టు కాదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ పోర్టు వల్ల సరకు రవాణాతోపాటు మత్స్యకారులకు కూడా లాభం కలుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పోర్టులు ఏర్పాటు చేస్తాం. అతి పెద్ద పేపర్ పరిశ్రమ ఎర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పోర్టు , పేపర్ పరిశ్రమలతో వేలాధి మందికి పని దొరుకుతుంది. విమర్శించే నాయకులు జిల్లాకు రాష్ట్రానికి ఏమి చేశారు. అభివృద్ది నిరోధకులు రాష్ట్రంలో ఎక్కువ అయ్యారు. పోర్టు షిప్పింగ్ హార్బర్ ఏర్పాటుతో జిల్లాలో మత్యకారులకు ఏంతో ఉపయోగం. మన రాష్ట్ర అభివృద్దికి 134 అవార్డులు వచ్చాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎసిపోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో పలు జిల్లాలలో ఏయిర్ పోర్టు నిర్మాణానికి స్తలాలు కేటాయించినా కేంద్రం సహకరించడం లేదు. కాంగ్రెస్ , వైఎస్ ఆర్ అవినీతి దెయ్యాలను శ్మశానంలో నిలబెట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. నాది పవిత్రపాదయాత్ర జగన్ విరామ పాదయాత్ర. సిబిఐ డైరెక్టర్ ను పున:నియమించడం సుప్రింకోర్టు నియమించడం మోదికి చెంపదెబ్బ అని అన్నారు. కోడి కత్తి కేసు వ్యవహారం ఎన్ ఐ యే కు అప్పచెప్పడం రాష్ట్రాన్ని దొడ్డి దారిన పరిపాలించడమే. కేంద్రం సహకరించకపోయిన రామాయపట్నం పోర్టు కట్టు తిరుతాం. ఇండోనేషియా ఏపిపి కాంపినీ వారు.. పేపర్ పరిశ్రమకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోర్టు రాకతో వేలాది మందికి నిరోద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ పోర్టు నిర్మాణం ప్రతిపక్ష పార్టీకి ఇష్టంలేక పోర్టు పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అయన విమర్శించారు.