పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఇవాళ ఖరారు చేసింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈ మేరకు పార్లమెంటు కార్యకలాపాలపై నిర్వహించిన సమావేశంలో కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. గత అక్టోబర్ నుంచే బడ్జెట్ ను రూపొందించే పనిలో కేంద్ర ఆర్థిక శాఖ నిమగ్నమై ఉంది.2019 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. 2019-20 బడ్జెట్ కు సంబంధించి గతేడాది అక్టోబర్ నుంచి ఆయా శాఖల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరుతోంది.