సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ చిత్ర నిర్మాతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు బడా నిర్మాతలు. ‘పేట’ చిత్రానికి థియేటర్స్ ఇవ్వకుండా బడా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ వాళ్లు అడ్డుకుంటున్నారని.. కేవలం వాళ్ల సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇచ్చుకుని చిన్న చిత్రాలను చంపేస్తున్నారు. ఇలాంటి మాఫియా కుక్కల్ని కాల్చిపడేయాలి అంటూ ‘పేట’ నిర్మాత వల్లభనేని అశోక్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో గుబులురేపుతున్న తరుణంలో ఆయన చిత్రానికి కేవలం రెండు థియేటర్స్ మాత్రమే కేటాయించడం పట్ల సర్వత్రా ఆసక్తినెలకొంది. అసలే సంక్రాంతి పండుగ.. పైగా నందమూరి నందమూరి బాలకృష్ణ, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్‌లు ఆర్నెళ్లు ముందుగానే సంక్రాంతి బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంటూ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ, వినయ విధేయ రామ (జనవరి 11), ఎఫ్ 2 (జనవరి 12) విడుదలకు సిద్ధంకాగా.. మధ్యలో ఖాళీగా ఉన్న 10వ తారీఖుని క్యాస్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చివరి క్షణంలో సంక్రాంతి రేస్‌లోకి వచ్చింది ‘పేట’ మూవీ. అయితే ఆర్నెళ్లు ముందుగానే ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకోవడంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. ఈ మూడు చిత్రాలు థియేటర్స్ సర్దుబాటు చేసుకోవడానికి తర్జనభర్జన పడుతున్నాయి. ఈ తరుణంలో తమిళ చిత్రం ‘పేట’ చిత్రానికి థియేటర్స్ కావాలంటూ నిర్మాత అశోక్ మీడియాకెక్కారు. మూడు తెలుగు చిత్రాలను భారీ బడ్జెట్‌తో రూపొందించిన క్రేజీ ప్రాజెక్ట్స్ మూవీస్ అని.. వాటికే థియేటర్స్ సర్ధుబాటు కావడం లేదని.. ఇలాంటి సందర్భంలో తమిళ అనువాద చిత్రం ‘పేట’కు థియేటర్స్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు తెలుగు నిర్మాతలు. దీనిపై పేటా నిర్మాత వల్లభనేని అశోక్‌కి తెలుగు నిర్మాతలకు వివాదం ఓ రేంజ్‌లో నడుస్తోంది. వాస్తవానికి ‘పేట’ మూవీ విడుదల తేదీ నాడు అనగా.. జనవరి 10న ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. అయితే 11 తేదీన వినయ విధేయ రామ, 12న ఎఫ్ 2 చిత్రాలు ఉండటంతో ‘పేట’ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కాబోతుంది. జనవరి 10 తరువాత హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సప్తగిరి థియేటర్, మల్కాజిగిరి రాఘవేంద్ర థియటర్‌లను మాత్రమే ‘పేట’ చిత్రానికి కేటాయించారు. ఒకవేళ సినిమా నిలబడితే తరువాత థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ‘పేట’కి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.