సచివాలయంలో బజాజ్ ఫిన్ సెర్వ్ మ్యానేజింగ్ డైరెక్టర్, కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సిఐఐ ) నేషనల్ కమిటీ ఆన్ ఇన్సూరెన్స్ ,పెన్షన్స్ ఛైర్మెన్ సంజయ్ బజాజ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అయన సమక్షంలో సిఐఐ,ఏపీ ఫింటెక్ వ్యాలీ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి సీఐఐ పూర్తి స్థాయి సహకారం అందించనుంది. ఆర్బీఐ,దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఫైనాన్స్ వ్యవస్థలు,ఫైనాన్స్ రంగంలో ఉన్న కంపెనీలతో సమన్వయ వేదిక ను సీఐఐ ఏర్పాటు చేయనుంది. మానిటరి అథారిటీ ఆఫ్ సింగపూర్, సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యం తో ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి కుడా సహకరించనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి,రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంజయ్ బజాజ్ కి మంత్రి నారా లోకేష్ వివరంచారు. విశాఖపట్నం ఫింటెక్ హబ్ గా మారుతుంది ఫింటెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే విధంగా యూజ్ కేస్ రిపాజిటరీ ఏర్పాటు చేసాం. ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తుంది.దీనితో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చెయ్యడం తో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ తో రక్షణ కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. ఇప్పటికే 25 ఫింటెక్ కంపెనీలు విశాఖపట్నం లో కార్యకలాపాలు ప్రారంభించాయి. పెట్టుబడులు ఆకర్షించడం లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 గా ఉంది. దేశంలో అతి పెద్ద రెండు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయి. 24 వేల కోట్ల పెట్టుబడితో ఆంధ్రా పేపర్స్ ఎక్స్ లెన్స్ కంపెనీ, కీయా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చెయ్యకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసామని అన్నారు. ఐటీ రంగంలో అదాని గ్రూప్ అతి పెద్ద పెట్టుబడి పెట్టబోతుంది. అనంతరం ఆర్టిజి సెంటర్ లో రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించారు. సంజయ్ బజాజ్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంతో ఇన్ని కార్యక్రమాలు,రియల్ టైం గవర్నెన్స్ అమలు చెయ్యడం నేను మొదటిసారి చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఫింటెక్ రంగం అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.