YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

జేఎఫ్సి కి ఏపీ ప్రభుత్వం నివేదిక

Highlights

  • 118 పేజీల నివేదిక సమర్పణ 
  • అందుబాటులో లేని పవన్‌
జేఎఫ్సి కి ఏపీ ప్రభుత్వం నివేదిక

జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీకి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపింది. 118 పేజీల నివేదికను దూత ద్వారా జేఎఫ్‌సీకి ప్రభుత్వం అందజేసింది. విభజనచట్టంలోని అంశాలు, ప్రత్యేక ప్యాకేజీ హామీల వివరాలతో నివేదికను రూపొందించారు. బడ్జెట్‌కి ముందు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన వివరాలతో నివేదికను తీర్చిదిద్దారు. నివేదిక వెళ్లిన సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అందుబాటులో లేరు. పవన్‌ వ్యక్తిగత సిబ్బందికి శ్రీకాంత్‌కు నివేదికను ప్రభుత్వ దూత అందజేశారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిఒకరు విమర్శు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ కేంద్రం ఎంత ఇచ్చింది.. కేంద్రం చేసిన సాయంతో ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల చేపట్టారు అనే విషయాన్ని నిగ్గుతేల్చేందుకు పవన్ ఆధ్వర్యం జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ ఏర్పాటైంది.

ఏపీ విభజన హామీలపై నిజాలను తేల్చేందుకు ముగ్గురు సభ్యుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జేఎఫ్‌సీ ప్రకటించింది. వివిధ పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాలతో శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు పవన్‌కల్యాణ్ ఆధ్యర్యంలో హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ సమావేశం జరిగింది. లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీపీఎం, సీపీఐ నుంచి మధు, రామకృష్ణ పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విభజన హామీలపై సూదీర్ఘంగా చర్చించారు. హోం శాఖ మాజీ కార్యదర్శి పధ్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్ చంద్రశేఖర్‌తో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఉప సంఘం సమాచారం సేకరిస్తుందని, ఆ తర్వాత కార్యాచరణ నిర్వహిస్తామని పవన్ చెప్పారు.

Related Posts