YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్ లో వినియోగదారుల కమిషన్ సర్క్యూట్ బెంచ్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఫిర్యాదుల అవకాశం

హైదరాబాద్ లో వినియోగదారుల కమిషన్ సర్క్యూట్ బెంచ్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఫిర్యాదుల అవకాశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ వినియోగదారుల కమీషన్ లో పెండింగ్ లో ఉన్న వినియోగదారుల ఫిర్యాదుల అప్పీలు, రివిజన్  పిటిషన్  లపై విచారణ జరిపేందుకు జాతీయ వినియోగదారుల వివాదాల, రిడ్రెసల్ కమిషన్ రెండు వారాల పాటు  హైదరాబాద్ లో సర్కూట్  బెంచ్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 8వ తేది వరకు  ఆదర్శ  నగర్ లోని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్ లో   వినియోగదారుల  భద్రతా చట్టం, 1986 ప్రకారం పెండింగ్ ఉన్నకేసుల విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా కోటీ   రూపాయలు అంతకు పైబడిన   ఫిర్యాదులను కూడా వినియోగదారులు  ఈ సర్క్యూట్ బెంచ్ వద్ద నేరుగా ఫిర్యాదు  చేయవచ్చు. ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా అప్పిల్స్ గాని, రివిజన్   పిటిషన్స్ గాని నేరుగా ఈ సమయంలో దాఖలు చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫిర్యాదుల పరిష్కారాల కోసం ఢిల్లీ వరకు వెళ్లకుండా ఆయా రాష్ట్రాల్లోనే పరిష్కారమయ్యే విధంగా జాతీయ కమిఫన్ ఆయా రాష్ట్రాల్లో సర్క్యూట్ బెంచ్ లను ఏర్పాటు చేస్తుంది. గతం లో జాతీయ కమీషన్ కేసుల విచారం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, కొచ్చిన్, అహ్మదాబాద్, భోపాల్, నాగపూర్, చండీఘడ్, జైపూర్, లఖ్ నవ్, కోలకత్తాలో స్క్యూట్ బెంచ్ లను ఏర్పాటు  చేసింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్న వినియోగదారుల కేసుల పరిష్కారానికి జాతీయ కమిషన్ అధ్యక్షుడు ఆర్.కె.అగర్వాల్ నేతృత్వంలో కేసుల విచారణను చేపట్టనున్నారు. వినియోగదారుల కేసులకు సంబంధించి నెల రోజుల ముందు నోటీసులు అందుకున్నవారు ఈ సర్క్యూ్ బెంచ్ ముందు హాజరు కావల్సి ఉంటుంది.

Related Posts