YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమీక్షలతోనే జనసేనాని సరి

 సమీక్షలతోనే జనసేనాని సరి
పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వారు ఎవరైనా, ముందుగా చెప్పేది, అతనికి స్థిరత్వం లేదని. అనేకసార్లు, తాను చేసిన పనులతో, అదే నిజం అని నిరుపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్తూ కూడా, ఈ అలవాటు మాత్రం మానటం లేదు. హడావిడి చెయ్యటం, సడన్ గా సైలెంట్ అయిపోవటం, పవన్ కు ఇది మామూలు విషయం. అందుకే పవన్ ను ఎవరూ, సీరియస్ పొలిటిషియన్‌గా తీసుకోరు. అతని సినిమా ఫాన్స్, ఆహా, ఓహో అని చెప్పటమే కాని, ప్రజలకు మాత్రం, తాను పార్ట్ టైమ్ పొలిటిషియన్‌ లాగానే కనిపిస్తున్నారు. తెలంగాణా ఎన్నికలు ముందు, ప్రజల నుంచి దూరమైన పవన్, అమెరికా పర్యటన అంటూ 15 రోజులు వెళ్లి.. మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చి, పది రోజులు అయినా, సమీక్షలకే పరిమితం అయ్యారు.ఇప్పుడు ఆయన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోరాట యాత్రను కూడా ఆపేశారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. ఇప్పటికీ నాకు సమయం సరిపోవడం లేదు అనే కారణం చెబుతున్నారు. అధికారంలో ఉన్నా .. ప్రతిపక్షంలో ఉన్నా సమయంతో పోటీ పడి రాజకీయాలను చక్క బెట్టుకోవాలి. అంతే కానీ.. ప్రతీ దానికి సమయం లేదని తప్పించుకోవడం రాజకీయం అనిపించుకోదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓ వైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే… పార్టీని నడుపుతున్నారు. ఆయన ఒక్కో జిల్లాకు పదుల సార్లు వెళ్లారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర యాత్ర ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో నడిచారు కలుస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు కూడా సిద్దం అవుతున్నారు. మరి ఇద్దరితో పోలిస్తే.. పవన్ కల్యాణ్.. ఏమంత బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలున్నాయి…? పదమూడు జిల్లాలు. ఈ పదమూడు జిల్లాలో తిరగడానికి కూడా.. పవన్ కల్యాణ్‌కు సమయం సరిపోలేదు. పోరాటయాత్ర చేస్తా.. కవాతు ద్వారా.. రాజకీయం చేస్తా అన్నాడు. కానీ ఐదు జిల్లాలు తిరిగే సరికే సమయం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి కాబట్టి.. పోరాటయాత్ర నిలిపివేసి.. ఆయన జిల్లాలలో అంశాల వారీ సమస్యలు తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారట. కనీసం పదమూడు జిల్లాల్లో పర్యటించలేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది పవన్ కల్యాణే. గత మేలో శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర చేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలు తిరిగేసి ఇక సమయం లేదని ఆగిపోవడం ప్రణాళిక లేని రాజకీయం అవుతుంది. కనీసం పార్టీ కార్యక్రమాల్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉంటే.. ప్రజలు ఎలా అధినేతను ఎలా నమ్ముతారంటూ జనసేనలోని ద్వితియ శ్రేణి నాయకులు అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనించిన పవన్‌ కల్యాణ్‌ ఆ తరహా రాజకీయాన్ని ఇక్కడ అమలు చేయాలని కొన్నినెలలుగా భావిస్తున్నారు. జేడీఎస్‌ ఆదర్శంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఏపీలో రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ జేడీఎస్‌ జాక్‌ పాట్‌గా సీఎం పీఠాన్ని పొందడమే పవన్‌ చూశాడు కానీ.. దానివెనుక కష్టాన్ని చూడలేదు. దానివెనుక ఉన్న దశాబ్దాల పార్టీ నిర్మాణాన్ని గమనించలేదు. జేడీఎస్‌ పార్టీ ఒక కుటుంబ పార్టీనే. అయితే ఆ కుటుంబీకులకు నిరంతరం రాజకీయమే వృత్తి. ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. నెలల తరబడి విరామాలు తీసుకోలేదు. అవేమీ గమనించకుండా అసలైన టైంలో టైమ్ లేదు అనడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

Related Posts