YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ, టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే

Highlights

పార్టీలో జోరుగా చర్చ

చంద్రబాబు వ్యూహాత్మక మౌనం

 

బీజేపీ, టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే

 

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టేననిపిస్తోంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తూ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఎంపీల పోరాటానికి సలహాలు ఇస్తూ స్టెప్‌ బై స్టెప్‌ నిర్ణయం తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. మలివిడత పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయ్యేనాటికి కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే కచ్చితంగా చంద్రబాబు మౌనం వీడి ఏదోఒకటి తేల్చుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ కేంద్ర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎలాంటి సమస్య ఎదురైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకపోవడమే మంచిది అనే సామెత ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఈ సామెతనే పాటిస్తున్నారు. అన్ని సమస్యలకు మౌనమే దారి చూపుతుందన్న భావనలో ఉన్నారు. మరి చంద్రబాబు భావిస్తున్నట్టు సమస్య పరిష్కారం అవుతుందా.. లేదా అన్నది చూడాలి.

 ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. అందరు ఏకమై ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని అన్ని రాజకీయ పక్షాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. వామపక్షాలతో సహా ప్రధాన ప్రతిపక్షం వైసీసీ కూడా ఇదేబాటను అనుసరిస్తున్నాయి. అటు టీడీపీ కూడా మిత్రపక్షమైన బీజేపీపైనా పోరుకు సై అంటోంది. టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్‌ను సమర్ధవంతంగా వినిపించారు. జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లగలిగారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారుకానీ.. ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 16 రోజులైంది. అయినా ఇంతవరకు చంద్రబాబు ఎక్కడా దానిపై మాట్లాడలేదు. మౌనమే తన సమాధానం అన్నట్టు సైలెంట్‌ అయిపోయారు.

పార్టీలో జోరుగా చర్చ
చంద్రబాబు మౌనంగా ఉండటంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకు చంద్రబాబు సైలెంట్‌గా ఉంటున్నారని వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరైతే చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమని వాదిస్తున్నారు. చంద్రబాబు సైలెంట్‌ వెనుక ఏదోమర్మం దాగుందని జోస్యాలు చెప్పేస్తున్నారు.రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఉద్యమాలు ఉధృతంగా జరిగాయి. ఈ సమయంలోనూ చంద్రబాబు కొన్ని రోజులపాటు సైలెంట్‌గా ఉన్నారు. ఆ రోజుల్లో పార్టీ నేతలు సైతం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా నాకు రెండు రాష్ట్రాలు సమానమని... రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని అన్నారేతప్ప.. అంతకుమించి ఎక్కడా మాట్లాడలేదు. అప్పుడు అలా మౌనంగా ఉండబట్టే ఏపీలో టీడీపీని కాపాడుకోగలిగారు. పాలిటిక్స్‌లో 40ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మాత్రం తొణకరు.. బెణకరు అన్నపేరు చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సేమ్‌ ఫార్ములానే అవలంభిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది అని పార్టీ అంతర్గత సమావేశాల్లోనే ఆయన తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి కేంద్రం తీరును ఎండగడితే సీన్ పూర్తిగా మారిపోతుంది.

బీజేపీ, టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే
బీజేపీ టీడీపీ మిత్రబంధానికి తెరపడినట్టే అవుతుంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మౌనంగా ఉంటూ అన్ని గమనిస్తూ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఎంపీల పోరాటానికి సలహాలు ఇస్తూ స్టెప్‌ బై స్టెప్‌ నిర్ణయం తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. మలివిడత పార్లమెంట్‌ సమావేశాలు పూర్తయ్యేనాటికి కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే కచ్చితంగా చంద్రబాబు మౌనం వీడి ఏదోఒకటి తేల్చుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ కేంద్ర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎలాంటి సమస్య ఎదురైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకపోవడమే మంచిది అనే సామెత ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఈ సామెతనే పాటిస్తున్నారు. అన్ని సమస్యలకు మౌనమే దారి చూపుతుందన్న భావనలో ఉన్నారు. మరి చంద్రబాబు భావిస్తున్నట్టు సమస్య పరిష్కారం అవుతుందా.. లేదా అన్నది చూడాలి.

Related Posts