YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈబీసీ బిల్లులుకు టీడీపీ మద్దతు

ఈబీసీ బిల్లులుకు టీడీపీ మద్దతు
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు టీడీపీ బేషరుతుగా మద్దతు తెలుపుతోందని ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. రాజ్యసభలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం తీసుకొచ్చిన బిల్లు మంచిదే కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అయితే, ఈ బిల్లును ఇంత హడావుడిగా తీసుకురావడం చాలా దురదృష్టకరమని విమర్శించారు. ఈ బిల్లుపై విస్తృత చర్చ నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపినా పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈబీసీ రిజర్వేషన్లపై చాలా మంది కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లనే సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగాల్లో సామాజిక సమతుల్యత లేదని విమర్శించారు. రెండు, మూడు శాతం జనాభా ఉన్న వర్గాలకే ఉన్నత పదవులు దక్కుతున్నాయని చెప్పారు నోట్ల రద్దు వల్ల పరిశ్రమల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత పడిందని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు... ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్థమే లేదని చెప్పారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు పేదల కోసం తెచ్చింది కాదని... పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారని విమర్శించారు. ఈబీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే... మూడేళ్ల క్రితమే బిల్లును తీసుకురావాల్సిందని చెప్పారు. ఎవరి కోసం ఈ బిల్లును తీసుకొస్తామని చెబుతున్నారో... నిజంగా ఆ వర్గాలకు న్యాయం జరగదని అన్నారు

Related Posts