YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్రామసభలు విజయవంతం చేయాలి

గ్రామసభలు విజయవంతం చేయాలి
జన్మభూమి 9వరోజు పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లాల కలెక్టర్లు,నోడల్ అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ గతంలో కన్నా ఈ జన్మభూమిలో అత్యధికంగా ప్రజల భాగస్వామ్యం. ఈ రోజు గ్రామసభలు విజయవంతం చేయాలి. శ్వేతపత్రంపై చర్చ చేయాలి. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి.  బుధవారం  ఒక్కరోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేశాం., లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయి. విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు. రూ.30వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పార్కులు, రూ.40వేల కోట్లతో సోలార్ పార్కులు వస్తాయి. వర్జీనియా కు ధీటుగా విశాఖ  మారుతుంది. ప్రకాశం జిల్లాలో రూ.24,500కోట్ల పెట్టుబడి రానుంది. ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ వస్తోంది. ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా రూ.12వేల మందికి ఉపాధి. దీనిద్వారా 50వేల  మంది రైతులకు ప్రయోజననమని అన్నారు.రామాయపట్నం పోర్టు,భావనపాడు పోర్ట్ రానున్నాయి. లాజిస్టిక్స్ హబ్ గా ఏపి కానుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు.  వెనుకబడిన జిల్లాలలో సంపద సృష్టిస్తున్నాం. యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి. అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాం. జన్మభూమిలో విద్యార్ధులు,ఉపాధ్యాయుల భాగస్వామ్యం అధికంగా ఉంది.  పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణంపై ప్రజల్లో సంతృప్తి వుందని అన్నారు. ఇళ్ల కోసం అనేక అర్జీలు వచ్చాయి. వచ్చిన అన్ని అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి. గ్రామ అభివృద్ది ప్రణాళిక అత్యంత కీలకం. పకడ్బందీగా వాటిని రూపొందించాలి. అభివృద్ధి ప్రణాళికల్లో గ్రామసభల్లో సమగ్ర చర్చ జరగాలని అన్నారు. జన్మభూమిలో సంక్రాంతి సంబరాలు జరపాలి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు నిర్వహించాలని అన్నారు. 

Related Posts