జగన్ ముగింపు సభలో అసత్యాలు మాట్లాడారు. అది పాదయాత్ర ముగింపు సభ కాదు. వైసీపీ పార్టీ కు ముగింపు యాత్ర సభ అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నీవు పాదయాత్ర చేసినా నీలో పరివర్తన రాలేదు. వైసీపీ నేతల్లో అభద్రతా భావం కనిపిస్తోంది. పక్క జిల్లాలో పాదయాత్ర లో ఉండి ,తుపాన్ బాధితులను పరామర్శించలేదని అయన అన్నారు. వైఎస్ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారు. కోట్ల రూపాయల అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తున్నారు. 24 వేల కోట్ల తో ప్రకాశం జిల్లాలో కాగితం పరిశ్రమ ,రామాయపట్నం పోర్టుకు కు శంకుస్థాపన చేసామని మంత్రి అన్నారు. వెనుకబడిన జిల్లా అనంతపురం కు కియా పరిశ్రమ వచ్చింది. మొదటి కియా కారు జనవరి 29 న బయటకు రాబోతోంది. జగన్ ఇడుపులపాయకు రాజధాని తీసుకువెళ్లాలని కుట్రలు చేస్తున్నాడు. ఇంటి ఇంటికి త్రాగునీరు ఇచ్చే జలధార కార్యక్రమం ప్రారంభించాం. నీ పాదయాత్ర లో మేము చేసిన అభివృద్ధి కనపడలేదా అని ప్రశ్నించారు. ఈ నెలలో 24 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం. జేపీ 75 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలని చెప్పారు..దానిపై జగన్ ఎందుకు మాట్లాడరు. అప్పుల్లో ఉన్న రాష్టాన్ని అబివృద్ది పధంలో నడిపేందుకు సీఎం కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికలే వైసిపి కి చివరి ఎన్నికలు. ప్రజలే జగన్ మోహన్ రెడ్డి కి బుద్ది చెబుతారని దేవినేని వ్యాఖ్యానించారు.