Highlights
పార్టీకి తనవంతు సేవకు అవకాశం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దీపక్ జాన్ లకు కృతజ్ఞతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెనికి చెందిన గుండు హనుమంతరావును టీపీసీసీ నియమించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకతను యువత, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొన్నాళ్లుగా టీపీసీసీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావును సోషల్ మీడియా విభాగంలోకి తీసుకోవాలని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా సెక్రటరీ దీపక్ జాన్.. నియామక ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తోపాటు సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గా అదనపు బాధ్యతలు అప్పగించటంపై కో ఆర్డినేటర్ హనుమంతరావు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీకి తనవంతు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దీపక్ జాన్ లకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.