కులాలతో సంబంధం లేకుండా పేదవారికి రిజర్వేషన్లు అందే విధంగా తీసుకోచ్చిన బిల్లును స్వాగతిస్తున్నామని బీజేపీ సినీయర్ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. పేదలు, సంపన్న వర్గాలతో పోటీ పడలేకపోతున్నారు. మోదీ పాలన రాజ్యాంగ బద్దంగా, ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. మోదీ పాలన సబ్ కా సాత్ సబ్ కా వికాస్. సామాన్య కుటుంబం నుండి వచ్చారు కనుకే సామాన్యుల సమస్యలు మోదీకి తెలుసని అయన అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడమే మోదీ పని. బీసీలకు ప్రత్యేక కమిషన్ కావాలని అడగ్గానే బీసీల కలను సాకారం చేసిన వ్యక్తి మోదీ. కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పేదవారికి రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మోదీదేనని అన్నారు. ఈ బిల్లు ఫలాలు ప్రజలందరికీ వర్తిస్తాయి. దేశంలోని పలు వర్గాల డిమాండ్ మేరకే ఈ బిల్లు తీసుకొచ్చాం. మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుండి పేదల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పేద వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మోదీ తోడ్పాటు అందించారు. మోదీ తెచ్చిన పథకాలన్నీ పెదప్రజలను దృష్టిలో పెట్టుకొని తెచ్చినవే. దేశంలోని ప్రజలందరూ ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజల అభివృద్ధికి పాటుపడాలనేది బీజేపీ సిద్ధాంతమని అయన అన్నారు. తినడానికి తిండి లేక పిండానికి పెట్టిన ఆహారాన్ని తినే పేద బ్రాహ్మణులు ఉన్నారు. సులబ్ కాంప్లెక్స్ లలో కూడా బ్రాహ్మణులు పని చేస్తున్నారు. అగ్రకులాల్లోని చాలా మంది పరిస్థితి హీనంగా ఉంది. ఆర్థికపరమైన వివక్ష సమాజంలో ఉంది. దీన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మోదీ మాత్రమే కొన్ని పనులు చేయగలరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే దమ్ము మోదీకి మాత్రమే ఉంది. ఓట్ల కోసం కాకుండా దేశ భవిష్యత్తు కోసం మోదీ నిర్ణయాలు తీసుకుంటారు. రిజర్వేషన్లు ఎన్నికల లబ్ది కోసం ముమ్మాటికీ కాదని అయన అన్నారు.