అయోధ్య కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణకు గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అయితే బెంచ్ నుంచి జస్టిస్ లిలిత్ తప్పుకోవడంతో మరొకరిని నియమించాల్సి ఉంది. దీంతో కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. బెంచ్ నుంచి తను తప్పుకోవడానికి గల కారణాలను జస్టిస్ లలిత్ బయటపెట్టలేదు.ఇదిలా ఉంటే గతంలో కల్యాణ్ సింగ్ తరఫున జస్టిస్ లలిత్ వాదనలు వినిపించారు. దీనిపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం తెలపడంతో.. బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నట్టు సమాచారం. బెంచ్‌లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్ డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్ర చూడ్ ఉన్నారు. తాజా పరిణామాలతో అయోధ్య కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు న్యాయనిపుణులు