ప్రజాసమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన జన్మభూమి సభ, అధికార, ప్రతిపక్షాల కు సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికైంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గంలో ని ఉయ్యూరు మునిసిపాలిటి పరిధిలో,15,16,17, వార్డులకు జన్మభూమి సభ నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైకాపా పెనమలూరు నియోజక వర్గ సమన్వయ కర్త కె పి సారధి హాజరయ్యారు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. సభ ప్రారంభం అనంతరం సారథి కి మాట్లాడే అవకాశం ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, హామీ ఇచ్చి కేవలం 10 వేలు, పసుపు కుంకుమ కింద ఇచ్చారని అయన విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము బ్యాంక్ వడ్డీలకే సరిపోయిందని ఆరోపించారు. తిత్లే తుఫాన్ కారణంగా పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదని, కోత కోసిన వరికి నష్ట పరిహారం పంపిణీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయటం లేదని అన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, యనమలకుదురు జన్మభూమి సభ నుండి ఉయ్యూరు వచ్చారు. అప్పటికి సారధి మాట్లాడుతూ, పేదల ఇళ్ళ నిర్మాణo పేరుతో వ్యాపారం చేస్తున్నారని, జీ ప్లస్ 3 భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు వ్యా పారులు 1800 రూపాయలకు వసూలు చేస్తుంటే 2200 ప్రభుత్వం ఏవిధంగా వసూలు చేస్తుందని సారధి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కి సారధి కి మధ్య వాదం జరిగింది. వైసిపి నేత రాజుల పాటి రామచంద్ర రావు లేచి మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వుండలేక పోతే వెళ్ళిపొండి అన్నారు. దీంతో వైసిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా టిడిపి కార్యకర్తలు, రామచంద్ర రావు పై కి దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. అనంతరం సారథి మీడియా తో మాట్లాడుతూ చేతగాని నేతలు ప్రశ్నిస్తే తటూకొలేక పోతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కులాల పేరుచెప్పి లబ్ది పొందాలని సారధి చూస్తారని ఎమ్మెల్యే, బో డే ప్రసాద్, ఎమ్మెల్సీ, వై వి బి రాజేంద్ర ప్రసాద్ లు ఆరోపించారు