YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కొణిదెల వెర్సెస్ నందమూరి

కొణిదెల వెర్సెస్ నందమూరి
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో బాలకృష్ణ - నటుడు నాగబాబుల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరింది. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా 'ఎర్రోడి వీరగాథ' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ వీడియోను రిలీజ్ చేశారు.గతంలో ఓ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. ఆడపిల్ల కనిపిస్తే "ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా" అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందస్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఎన్టీఆర్ కథాయకుడు' అనే చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో 'ఎర్రోడి వీరగాథ' పేరుతో మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోను విడుదల చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.ఈ వీడియోలో కొంతమండి మహిళలు ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదుతున్నారు. వారిని అడ్డుకున్న నాగబాబు.. ఎందుకు కొడుతున్నారని అతన్ని ప్రశ్నిస్తాడు. దానికి అతని సమాధానం చెప్పాడు. ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా అని పెద్దలు చెప్పారని అందుకే ముద్దు పెట్టాలని ఓ అమ్మాయిని అడిగానని చెప్పాడు. దీంతో షాకైన నాగబాబు.. ఆడవాళ్లను పిలిచి మరీ చితక్కొట్టిస్తాడు.కొంతకాలంగా నందమూరి బాలయ్య టార్గెట్‌గా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ వివాదాస్పదంగా మారిని మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదానికి ముగింపు పలికేందుకు రెడీ అయ్యారు. అయితే తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లను గతంలో బాలయ్య చేసిన కామెంట్స్‌పై వరుస వీడియోలను విడుదల చేసి నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య అగ్గిరాజేసిన నాగబాబు.. అసలుది చివరి వీడియోను ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మీరు మా ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడారు.. మీ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవీలో ఉంటూ.. ఓ పార్టీ ఫౌండర్ కొడుకు అయి ఉండి నా అన్న, తమ్ముళ్లను అంటే నాకు బాధ ఉందడా?. నేను మీ గురించి వంద కామెంట్లు చేయడానికి ఇన్ఫర్మేషన్ ఉంది. మేము టార్గెట్ చేస్తే మీరు తట్టుకోగలరా?. నేను నా ఫేస్ బుక్ ఇంటర్వ్యూలో బాలయ్య ఎవరో తెలియదు అన్నాను దానికి రాద్ధాంతం చేస్తున్నారు. ఈయనేమో మా ఫ్యామిలీని డైరెక్ట్‌గా టార్గెట్ చేయొచ్చు. మేం మాత్రం నాకు పెద్ద బాలక్రిష్ణ తెలుసు అంటే తప్పు వచ్చిందా? నేను ఆ మాట అనగానే మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. ఇండస్ట్రీ నుండి చాలా మంది ఎగబడుతున్నారు. వాళ్లు డైరెక్ట్‌గా మమ్మల్ని అంటే సైలెంట్‌గా ఉంటారు. మేం ఇన్ డైరెక్ట్‌గా అంటే మీడియాకి వచ్చి మరీ రచ్చ చేయడం నాకు బాధ కలిగించింది. అందుకే వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఐదు కామెంట్స్ పెట్టా. అందులో ఎక్కడా నేను ఆయన పేరును ప్రస్తావించలేదు. ఆయన అడ్రస్ చెప్పలేదు. అవన్నీ మీకు ఎందుకు ఆపాదించుకుంటున్నారు. వేమూరి బాలక్రిష్ణ అంటే మీకెందుకు వచ్చింది. సారే జహాసే అచ్చాను ఓ పిల్లోడు బాగా పాడాడు. అది నాకు నచ్చింది షేర్ చేశా. దానిపై మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు. నేను మిమ్మల్ని అనలేదు. గుమ్మడి కాయ దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. మేం వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినవాళ్లం. మీలా రాజవంశీయులు కావచ్చు. మేం మామూరు మనుషులం. మీరన్నారు కదా.. అలగా బలగా సంకర జాతి అని ఆ జాతి నుండి వచ్చిన వాళ్లమే మాకు కుక్కలంటే ఇష్టం. మాకు పాడి పరిశ్రమ ఉంది. నాకు సరదాగా నచ్చి మంచి బ్రడ్ అండ్ బ్రీడ్ ఉన్న దున్నపోతులు కుక్కల ఫొటోలను పెట్టాను. అది కూడా మిమ్మల్ని అన్నట్టేనా? ఇక నేను పెట్టిన కవిత.. ‘కట్టుకథలుకొన్ని కల్పనలు కొన్ని చుట్టనేల.. మూట కట్టనేల నిజం కక్కనేల బయోపిక్కులొద్దయా విశ్వదాభిరామ వినరా మామా..’ మాకు కవిత్వాలు వచ్చని రాశా. దీన్ని కూడా మీకు ఆపాదించుకున్నారు. వాళ్లకి నా ఫస్ట్ క్వచ్ఛన్.. మీరు ఒక్కరే బయోపిక్‌లు తీశారా? మహానటి బయోపిక్ కాదా? సంజయ్ దత్ బయోపిక్ లేదా? యాత్ర సినిమా బయోపిక్ కాదా? ఎన్ని బయోపిక్‌లు లేవు. మీరు నిజాలనే తీస్తున్నారేమో.. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. మీ సినిమాపై నేను ఎందుకు కామెంట్ చేస్తా. వాళ్లెవరూ రియాక్ట్ కానప్పుడు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు. అంటే మీ బయోపిక్‌లో నిజాలు లేవా? మా అభిమానులు మిగతా హీరోల అభిమానుల్ని గౌరవిస్తాం. ఆయన మా ఫ్యామిలీపై ఇన్నిసార్లు కామెంట్ చేశారు. నేను ఒక్కమాట అంటే ఫీల్ అవుతున్నారు. మరి వీటికి ఏం సమాధానం చెప్తారు. నేను విడుదల చేసిన విడుదల అన్ని వీడియోలను ఒకసారి చూడండి. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని ఆలోచించండి. మేం ఎవరినీ అవమానించే వ్యక్తులం కాదు. మైడియర్ ఫ్రెండ్స్. ఇవే కాదు ఇంకో కామెంట్ కూడా ఉంది. పాత పత్రికల్లో అది ఉంది. 2011లో బాలక్రిష్ణ మా ఫ్యామిలీ గురించి ఓ కామెంట్ చేశారు. అప్పుడే నేను రియాక్ట్ కావాల్సింది. కాని మా అన్నయ్య ధర్మరాజు లాంటి వాడు. ఆవేశాన్ని నీళ్లు పోసి ఆపేస్తారు. వివాదాల జోలికి పోవద్దంటారు. నేను అలా వెళ్లదర్చుకోలేదు. అయితే దానిపై కూడా కౌంటర్ ఇచ్చి వివాదానికి ముగింపు పలుకుతా. నేను ఇవ్వబోతున్నదే అసలు కౌంటర్. ఆ రోజు మీరు చిరంజీవిని ఏమన్నారో నా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఈ వివాదాల కారణంగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నటుడిగా నాకు ఉన్న కొద్దిపాటి గుర్తింపు చాలు. జబర్దస్త్ జడ్జ్‌గా నాకు ఉన్న ఆ మాత్రం గుర్తింపు చాలు. నాకు పబ్లిసిటీ పిచ్చి అసలు లేదు. ఆరో కామెంట్ కోసం వెయిట్ చేయండి. దానికి కౌంటర్‌ కోసం వెయిట్ చేయండి. క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది వెయిట్ చేయండి అంటూ సుదీర్ఘ వివరణతో వీడియో పోస్ట్ చేశారు నాగబాబు. 

Related Posts