YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడుకి తృటిలో తప్పిన ప్రమాదం

అచ్చెన్నాయుడుకి  తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. మంత్రి కాన్వాయ్‌లోని వాహనంపై వైసీపీ హోర్డింగ్ బోర్డు కూలి పడింది. మంత్రి ప్రమాద నుంచి సురక్షితంగా బయటపడగా.. నలుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మంత్రి ఇచ్ఛాపురంలో జరిగిన టీడీపీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సోంపేట మండలం కొర్లాం నుంచి ఇచ్ఛాపురం వరకూ కొనసాగింది. ర్యాలీ ఇచ్ఛాపురం చేరుకోగానే.. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ హోర్డింగ్ కూలిపడింది. ఆ హోర్డింగ్ నేరుగా మంత్రి వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనంపై పడిపోయింది. మంత్రి ఆ వెనుకే ఉన్న వాహనంలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలపై హోర్డింగ్ పడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి కార్యకర్తలు వారిని బయటకు లాగారు. ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మంత్రి అచ్చెన్నాయుడుకి ఏమి కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. 

Related Posts