YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీతో పొత్తా... ఒంటరా

 టీడీపీతో పొత్తా... ఒంటరా
తెలుగుదేశంతోపాటు దేశంలోని ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 20న నిర్ణయం తీసుకోనుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ దిశానిర్దేశం చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలతోపాటు అన్ని కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని పీసీసీలకు పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ‘ఇంటింటా కాంగ్రెస్’ క్యాంపెయిన్ త్వరగా పూర్తి చేయాలని ఈ కమిటీ పీసీసీలకు ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి చేయాలని ఈ సమావేశం నిర్ణయానికి వచ్చింది. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏఐసీసీ మేనిఫెస్టో, ఎన్నికలు జరిగే రాష్ట్రాల మేనిఫెస్టోలను కూడా త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించింది. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆయా రాష్ట్రాల్లో పోత్తులపై ఒక స్పష్టతకు రావాలని సమావేశం నిర్ణయించింది. అలాగే ఇతర పార్టీలతో పొత్తులపై ఈ నెల 20నాటికి ఒక నిర్ణయానికి రావాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. బీజేపీ వైఫల్యాలపై చార్జిషీట్‌ను రూపొందించాలని అన్ని పీసీసీలను పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఆదేశించింది. తెలుగుదేశం పార్టీతో సహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనే అంశంపై ఈ నెల 20న పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి రానుందని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపాల కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని కమిటీలను పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని 30 శాతాన్ని పూర్తి చేశామని, త్వరలో 100 శాతం పూర్తి చేస్తామని రఘువీరా చెప్పారు. 

Related Posts