YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కమలంలో కత్తులు కొందరు రాజీనామాలు..మరికొందరు రాజీలు

కమలంలో కత్తులు కొందరు రాజీనామాలు..మరికొందరు  రాజీలు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. దానికి కారణం విభజన హామీలపై దారుణంగా వంచించడమేనని… ఆకుల సత్యనారాయణ తన రాజీనామా కారణాలను స్పష్టంగా చెప్పారు. రాజకీయ భవిష్యత్ కోసమే.. తాను బీజేపీని వీడాల్సి వస్తోందని… అన్యాపదేశంగా అయినా చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా ప్రతి అంశంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం.. ఏపీని వంచించిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత మొదటిసారిగా…ఈ తరహాలో గళం విప్పారు. ఇంత వరకు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ విమర్శలు చేస్తూంటారు. దీనికి… కౌంటర్‌గా బీజేపీ నేతలు చాలా మాటలు మాట్లాడుతూంటారు. ప్రధాని నుంచి సోము వీర్రాజు వరకు.. చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటూ చెప్పుకొస్తారు కానీ.. విభజన హామీల గురించి మాట్లాడరు. కానీ.. ఇప్పుడు.. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా విమర్శలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనత పార్టీ అన్యాయం చేసిందేనేది… ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. తాము ఎంతో చేశామని బీజేపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేయడం.. రాష్ట్ర ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నమే. ప్రజల్లో ఏ మాత్రం పట్టు లేని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చే పదవులపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారణంగా వీరు ఢిల్లీలోని తమ నాయకత్వాన‌్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ  ప్రజల మనోభావాల్ని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం లేదు. ప్రధానమంత్రి మోడీ.. యాప్‌ ద్వారా ఏపీ కార్యకర్తలతో మాట్లాడితే మోడీని సంతోష పరిచేందుకు చంద్రబాబును.. ” లుచ్చా.. బెచ్చా..” అని సోము వీర్రాజు లాంటి నేతలు తిట్టారు కానీ.. ఏపీ కి రావాల్సిన విభజన హామీలపై మాత్రం నోరెత్తలేదు. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్న పరిస్థితుల్లో.. ఇప్పుడు బీజేపీకి.. ఆకుల సత్యనారాయణ రూపంలో సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు బయటకు వస్తున్నాయి.ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా గెలిచిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరు పార్టీలో ఉంటారు.. ఎవరు పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీలేదు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వీరు.. తమ పార్టీ అగ్రనాయకత్వం పై కినుకతోనే ఉన్నారు. కానీపార్టీని ఎదిరించలేక పోతున్నారు. అందుకే వీరిలో..అవకాశం ఉన్న వాళ్లు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరిపోతున్నారు. కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు.. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆరెస్సెస్ నుండి వచ్చిన మాణిక్యాలరావు… పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయరు. కానీ పోటీకి మాత్రం దూరంగా ఉంటారని చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, హరిబాబు తాము పోటీ చేయడం లేదని సన్నిహితులకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీ బీజేపీలో ఆకుల సత్యనారాయణ రాజీనామా సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts