సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ పాజిటివ్ టాక్ రాబట్టింది. మహానటుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించిన ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులంతా ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. క్రిష్ దర్శకత్వంలో, బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాతోపాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తొలి రోజు మంచి వసూళ్లు సాధించి. ఈ చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.61 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. రెండో రోజు విషయానికి వస్తే.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.23.2 లక్షలు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. నిజాం ఏరియాలో ఈ చిత్రం రెండ్రోజుల్లో కలిపి రూ.2.19 కోట్లు రాబట్టింది. సీడెడ్‌లో రూ.95 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.97 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా జిల్లాలో రూ.85 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.48 లక్షలు రాబట్టింది. గుంటూరులో అత్యధికంగా రూ.2.14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.63 లక్షల మేర వసూళ్లు రాబట్టింది. నెల్లూరులో రూ.56 లక్షలు వసూలు చేసింది. రెండ్రోజులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.77 కోట్లు వసూలు చేసింది. అంటే రెండో రోజు వసూళ్లు ఏపీ, తెలంగా రూ.1.16 కోట్లకు పడిపోయాయి. ఎన్టీఆర్ బయోపిక్ హక్కులను రూ. 71.30 కోట్లకు విక్రయించారు. తొలి రోజుతో పోలిస్తే.. రెండో రెండో కలెక్షన్లు బాగా తగ్గాయి. కానీ శనివారం నుంచి ఈ సినిమా వసూళ్లు ఊపందుకునే అవకాశం ఉంది. వీకెండ్‌తోపాటు సంక్రాంతి కలిసి రావడం.. మరో పెద్ద సినిమా ‘వినయ విధేయ రామ’కు మిక్స్‌డ్ టాక్ రావడం లాంటి అంశాలు.. ‘ఎన్టీఆర్’కు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది