రాష్ట్రియ బాల స్వాస్ధ్య కార్యక్రమము లో భాగమైన ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమము క్రింద 0-18 సంవత్సరముల వయస్సు గల విద్యార్ధులో రక్తహీనత ను గుర్తించుటానికి కొత్తగా ప్రవేశపెట్టిన పరికరాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యమంత్రి బాల సురక్ష బృందాలకు అందచేశారు. సాధారణంగా సూది ద్వారా రక్త సేకరణ చేసి హెచ్ బి ని గుర్తిస్తారు. కానీ ఈ పరికరమును ఉపయోగించడం ద్వారా సూది తో రక్తాన్ని తీసే అవసరం లేకుండా కేవలం కంటి లోని కంజెక్టీవను ఫోటో తీసి మొబైల్ లేదా ట్యాబు లో ప్రత్యేకమైన యాప్ ద్వారా పిల్లలలో రక్తహీనత ను గుర్తించవచ్చు. ఈ కార్యక్రమములో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్ధులకు ప్రాథమిక దశ లోనే రక్తహీనతను గుర్తించడం ద్వారా విద్యార్ధుల ఆరోగ్నాన్ని కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ కమీషనర్ ప్రశాంతి, సమన్వయకర్త ఆర్.బి.ఎస్.కె. హెమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.