పేదరికం లేని సమాజస్థాపన ఆశయంతో ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం ఉదయం చీమకుర్తి నగర పంచాయితీ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 19.20 వార్డులకు సంబంధించి 6వ విడత జన్మభూమమి మావూరు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులందరిని ఒకే చోట జన్మభూమి- మావూరు కార్యక్రమంలో పాల్గొనేలా చేసి గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుత జన్యభూమి- మావూరి కార్యక్రమంలో అర్జీలు యిచ్చే ప్రజల సంఖ్య తక్కువగా వుందన్నారు. ప్రజలు చాలా సంతృప్తిగా వున్నారన్నారు. రాష్ట్రం విడిపోయి 16 వేల 5 వందల కోట్టు లోటు బడ్జెట్ వున్నప్పటికి రైతుల ఇబ్బందులలో వున్నప్పటికి రెండంకెల వృద్ధి సాధించామని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి చంద్రన్న బీమ పధకం ద్వారా రూ.5 లక్షలు, సహజమరణానికి 2 లక్షలు బాధిత కుటుంబానికి అందించి ముఖ్యమంత్రి పెద్ద కొడుకుగా వుండి ఆయా కుటుంబాలను ఆదుకొవడం జరుగుతున్నదన్నారు. అదే విధంగా పేద ప్రజలకు ఆసరాగా చంద్రన్న పెళ్లి కానుకలు యిచ్చి ఆదుకుంటున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు 50 వేలు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు తొలుతగా జన్యభూమి మావూరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరం, ఉద్యానవన శాఖ శిబిరం, వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన శిబిరాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇఇ రాంమెహన్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, మున్సిపల్ ఛైర్మన్ కేత్రపు రాఘవ రావు, వైస్ ఛైర్మన్ కందిమళ్ల గంగాధర రావు, మాజీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మన్నం శ్రీదర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.