YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో భువా-భతీజా కలిసి పోటీ

యూపీలో భువా-భతీజా కలిసి పోటీ
ఉత్తరప్రదేశ్‌లోని అత్తా అల్లుళ్లు (భువా-భతీజా) మాయావతి, అఖిలేశ్ యాదవ్ కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారై పోయింది. ఒకప్పటి ఆగర్భ శత్రువులైన బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవా లన్న నిర్ణయం ఇంచుమించు ఖాయమైంది. ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉండే ఈ రెండు పార్టీలు యూపీలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒకటయ్యాయి. విడివిడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోవడం తప్ప ప్రయోజనం ఉండబోదని తెలుసుకున్నాయి. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే అఖిలేశ్‌ను మాయావతి తన ‘భతీజా’ (అన్న కొడుకు) అని పిలిచారు. వెంటనే అఖిలేశ్ కూడా స్పందించి.. ఆమెను ‘భువాజీ’ (మేనత్త) అని సంబోధించారుఅదే విషయాన్ని ప్రకటించేందుకు శనివారం ఇద్దరూ కలిసి యూపీ రాజధాని లఖ్‌నవూలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి మరి కుండబద్దలు కొట్టారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో కూడా ఒక అవగాహన వచ్చేసింది.కొన్ని వారాలుగా వీరిద్దరి మధ్య ఈ అంశంమై చర్చలు జరుగుతున్నాయి. గతవారం ఢిల్లీలో సమావేశమైనప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ కొన్ని వారాల్లో మాయావతి, అఖిలేశ్‌లలో ఎవరు మీడియా ముందుకు వచ్చినా కూటమి గురించే మాట్లాడుతున్నారు. అలాగే అఖిలేశ్ యాదవ్ మీద అక్రమ మైనింగ్ లైసెన్సుల విషయమై సీబీఐ దాడులు జరిగినప్పుడు ఆయనకు మాయావతి అండగా నిలబడ్డారు. ఈ దాడులతో ఏమాత్రం భయపడొద్దని ఆమె తన మేనల్లుడికి సలహా ఇచ్చారు. . అప్పటినుంచి వారిద్దరూ యూపీ అత్తా అల్లుళ్లుగా ప్రచారంలోకి వచ్చారు.ఆగ్రాలో నిర్వహించిన ఒక ర్యాలీలో మాయావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్ యాదవ్ ఖండించారు. తమ కూటమి అంటే మోదీ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రీయ లోక్‌దళ్, నిషాద్ పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోంది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎప్పుడూ పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలి స్థానాలలో మాత్రం తమ పోటీ పెట్టకూడదని మాయావతి - అఖిలేశ్ నిర్ణయించారు. వీళ్లిద్దరూ ఇలా చేస్తారని ముందునుంచే ఊహించారో ఏమో గానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందునుంచి యూపీ ఎన్నికల్లో ఒంటరి పోటీవైపే మొగ్గు చూపుతోంది. కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు పూర్తి నిరాశాజనకంగా ఉంటాయన్న భయం కూడా కాంగ్రెస్‌కు ఉంది.  2014 ఎన్నికల్లో బీజేపీ, అప్నాదళ్ కలిసి యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో 73 చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరిగి అధికారాన్ని చేపట్టాలని అఖిలేశ్ భావించి పొత్తు పెట్టుకున్నా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి కలిసి పోటీ చేయాలని మాయావతి, అఖిలేశ్ నిర్ణయించుకున్నారు. దాంతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు గోరఖ్‌పూర్‌లోనిషాద్ పార్టీ, కైరానాలో రాష్ట్రీయ లోక్‌దళ్, ఫూల్‌పూర్‌లో సమాజ్‌వాదీ గెలిచాయి. దాంతో ఈ కూటమిపై ఆశలు పెరిగాయి. బీజేపీని పూర్తిగా ప్రజలకు దూరం చేయాలంటే తాము కలిసి పోటీ చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే కూటమితో పోటీచేస్తే ఇవే తరహా ఫలితాలు రాష్ట్రమంతా వస్తాయని ఆశిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే మాత్రం ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి చాలా పెద్ద తలనొప్పే అవుతుంది. 

Related Posts