ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంట చేతికోచ్చి తమ కష్టాలు తీరుతాయని రైతు సంబర పడ్డారు. ప్రకృతి అనుకూలించినప్పటికి దేవుడు వరం ఇవ్వలేదు అన్న చందంగా మార్కెట్‌లో ఉల్లికి ధర లేకపోవడంతో చేసిన కష్టం బుడిద పాలైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కృష్ణానది తీర ప్రాంతంలో దాదాపు 450 ఎకరాల్లో యాపర్ల, గుమ్మడం, పెంచికాల పాడు, ఈర్లదినె్న, బుడిదపాడు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులు ఉల్లి పంట సాగు చేశారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఉల్లి పంట సాగు చేస్తే లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు. అదే క్రమంలో గత ఏడాది పెబ్బేరు మార్కెట్‌వారి ఆద్వర్యంలో క్వింటాల్‌కు రూ.1500 మద్దతు ధర కల్పించి పొలాల వద్దే కొనుగులు చేశారన్నారు. ఈ ఏడాది రైతులకు ప్రభుత్వం ఎటువంటి మద్దతు ధర కల్పించకపోవడంతో కొందరు రైతులు నేరుగా పండించిన కొందరు రైతులు ఉల్లిగడ్డను రాష్ట్ర రాజదానిలోని మలక్‌పేట ఉల్లి మార్కెట్‌కు తరలించారు. అక్కడ ఒక క్వింటాల్‌కు రూ.200 నుండి రూ.300 మాత్రమే ధర చెల్లిస్తామని ట్రెడర్లు తెల్చి చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. వాహాన రవాణా ఖర్చులు సైతం రాని పరిస్థితి ఏర్పడటంతో ఉల్లి గడ్డను మార్కెట్‌లోనే వదిలేసి వచ్చామని రైతులు విలేఖరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డకు ధర పూర్తిగా పడి పోయిందని, తోటి రైతులకు వారు తెలపడంతో పొలాల్లోనే ఇంక ఉన్న ఉల్లి పంటను రైతులు పంటను కొయలేక అలాగే గొర్రెలు, పశువుల మేతకు వదిలేశారు. ఒక యాపర్ల గ్రామంలోనే 300 ఎకరాలలో ఉల్లిపంట సాగు చేశారు. కొందరు రైతులు కుప్పలుగా పోయగా మరికొందరు ఉల్లిపంటను అలాగే వదిలేశారు. రైతే రాజు అని ప్రభుత్వాలు గర్వంగా చెబుతున్నప్పటికి సాగుచేసిన పంటకు మద్దతు థర లేక ఎకరాకు 20 నుంచి 30వేల వరకు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటను సాగుచేసినప్పటికి కష్టం వృదా అయి అప్పులు మాత్రం మిగిలాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి రైతులను అదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు కన్నీంటి పర్యంతమయ్యారు ఉల్లి పంట సాగు చేసిన వారికి నష్టం వస్తే ఎటువంటి మద్దతు ధర కల్పించదని ఆర్టికల్చర్ మండల అధికారి నర్సింహ్మయ్యశెట్టి తెలిపారు. దాంతో పాటు పండిన పంటకు ఎటువంటి బీమా కూడా వర్థించదని తెల్చి చెప్పారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫేడ్ ద్వారా కొని రేషన్ డీలర్ల సహయంతో కిలోల ప్రకారం అందించిందని తెలిపారు. ఈ ఏడాది ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన తెలిపారు.ఏడాది లాగే ఈ ఏడాది కూడా రెండు ఎకరాలో ఎకరాకు రూ.15వేల చోప్పున కౌలు చెల్లించి ఉల్లి పంట సాగుచేశానని చెప్పారు. గతంలో లాభాలు వచ్చాయని, ఈ ఏడాది కూడా లాభం వస్తుందని, రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేయగా ఎకరాకు రూ.20వేల నుండి 30వేలు సాగుకు ఖర్చయిందన్నారు. దాంతోపాటు రూ.15వేలు కౌలు చెల్లించానని దీంతో లక్షల రూపాయాల వరకు రైతులు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. కౌలు రైతులను అదుకోవాలని కౌలు రైతు వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు.