YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

భారత్‌-ఇరాన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు

Highlights

  • ఢిల్లీలో భారత ప్రధాని, ఇరాన్‌ అధ్యక్షుల భేటి
  • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ
  •  పలు కీలక ఒప్పందాలు
భారత్‌-ఇరాన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలు

  భారత్‌-ఇరాన్‌ల మధ్య సంబంధాలు చారిత్రాత్మకం, నాగరికతతో కూడినవని ఇరాన్‌ అధ్యక్షుడు రౌహాని అన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్రమోది, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ భేటి అయ్యారు. భారత, ఇరాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.  చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం తదితర 9 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని.... ముఖ్యంగా రవాణా, ఇంధనం రంగాల్లో పటిష్ట బాంధవ్యం ఉందని రౌహాని వెల్లడించారు. రౌహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నేతలు పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రౌహనీ నేతృత్వంలో  రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని మోదీ అన్నారు. చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధికి దోహదపడటానికి అనుమతించిన రౌహానీ దార్శనికతను మోదీ ప్రశంసించారు. తమ పొరుగు దేశాలు ఉగ్రవాద రహిత దేశాలుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు మోది పేర్కొన్నారు. 

Related Posts