ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్)కు తేదీలు ఖరారయ్యాయి. శనివారం ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. అన్ని సెట్ లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మంత్రి శనివారం మీడియాకు తెలిపారు. గతంలో పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడం వల్ల ఇతర రాష్ట్రాలకు మన విద్యార్థులు వెళ్లిపోయేవారు. మొత్తం ఏడు సెట్ లు ఆన్ లైన్ లో నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల వారిగా సెట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఈ సెట్ ఏప్రిల్ 19(అనంతపురం జేఎన్టీయూ), ఏపీ ఐ సెట్ ఏప్రిల్ 26(ఎస్వీయూ), ఏపీ పీజీ సెట్ మే 1 నుంచి(ఏయూ), ఏపీ ఎడ్ సెట్ మే 6 (ఎస్వీయూ), ఏపీ లా సెట్ మే 6(ఎస్కేయూ), ఏపీ పీఈ సెట్ మే 5 నుంచి(నాగార్జున), ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 20 నుంచి(కాకినాడ జేఎన్టీయూ)లో జరుగుతాయాని అయన అన్నారు. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి అన్నారు. గత రెండేళ్లుగా ఆన్ లైన్ లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.