Highlights
- తొలి టీ20కి సిద్ధమైన వాండరర్స్ స్టేడియం
- టీమిండియాకే తొలి టీ20లో విజయావకాశాలు
- ఇరు జట్లు 10 టీ20ల్లో పోటీ పడగా
- భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గన భారత్
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఎదురులేని ఇండియా.. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. వన్డే టాప్ ర్యాంకర్ సౌతాఫ్రికా, సెకండ్ ర్యాంకర్ భారత్ మధ్య తొలి టీ20కి వాండరర్స్ స్టేడియంలో రంగం సిద్ధమైంది.వన్డే సిరీస్ నెగ్గి జోరు మీదున్న విరాట్ కొహ్లీ అండ్ కో టీ20ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది.
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో టీమిండియా,సౌతాఫ్రికా మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. తొలి టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా....సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల సిరీస్‌కు సై అంటోంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో టీ20 3వ ర్యాంకర్ భారత్‌కు 6వ ర్యాంకర్ సౌతాఫ్రికా సవాల్ విసురుతోంది.
వన్డే సిరీస్ విజయంతో విరాట్ కొహ్లీ అండ్ కో జోరు మీదుంది. ఆల్‌రౌండ్ పవర్‌తో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా..టీ20 సిరీస్ సైతం నెగ్గి చరిత్రను తిరగరాయాలని ప్లాన్‌లో ఉంది. వన్డే సిరీస్‌లో తేలిపోయిన సౌతాఫ్రికా జట్టు టీ20ల్లో డుమిని సారధ్యంలో బరిలోకి దిగనుంది.వన్డే సిరీస్ ఓటమికి భారత్‌పై బదులు తీర్చుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది.
టీ20 ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 10 టీ20ల్లో పోటీ పడగా...భారత్ 6 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 4 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాకే తొలి టీ20లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.