ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాం. అపోహలొద్దు. తొందర్లో రైతుల దగ్గర నుండి భూములు కొనుగోలు చేస్తాం అని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. మైలవరం మండల పరిధిలోని యమ్. కంబాలదిన్నె గ్రామ సమీపంలో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శనివారం ఉదయం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ సీఎం డి.మధుసూదనరావు పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు తొలగిపో యే విధంగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి నిజం చేయాలన్నదే నా ధ్యేయం అని అన్నారు.ఇందుకు భూసేకరణ ఎలా చేయాలి అన్న దానిపైన రెవిన్యూ అధికారులు మరియు కలెక్టర్ తో చర్చించామన్నారు. ఇందుకు రైతులు భూమి 400 ఎకరాలు,డికేటి భూమి 110 ఎకరాలకు ఎక్కడా కూడా సమస్య లేకుండా రైతులతో చర్చిస్తామన్నారు. రైతులు కూడా తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఇక్కడ ఒక స్థానిక కమిటీ అన్ని వసతులు ఉన్నా కేంద్రం సహకరించక పోవడంతో అక్కడ ఒక లీగల్ అడవైజ్ కమిటి ని వేసి సుప్రీంకోర్టు ను కూడా సంప్రదించాలన్నారు. అమరావతి ని ఎలా లండన్ బెస్ట్ ఏజెన్సీ ద్వారా చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా ఒక మంచి ఏజెన్సీ ని ఏర్పాటు చేయాలన్నారు.ఈ విషయాన్ని ఏపీ ఎండీసీ వెంకయ్య చౌదరి కి తెలపడం జరిగిందన్నారు. స్టీల్ కార్పొరేషన్ తరుపున ప్రత్యేక ఏపీఎండీసీ వెహికల్ ఏర్పాటు చేయాలన్నారు.ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పించేందుకు అందుబాటులో ఉందన్నారు .10 కిలోమీటర్ల దూరంలో గండికోట ప్రాజెక్టు నుండి నీటి సౌకర్యం కలదు. అలాగే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుండి రైల్వే లైన్ కూడా కలదు. నలువైపులా చుట్టూ నాలుగు రహదారు లు ఉన్నాయని కూడా తెలిపారు . అలాగే తలమంచిపట్నం వద్ద నుండి 400 కేవీ సామర్థ్యం తో విద్యుత్ సౌకర్యం కూడా కలదని తెలియపరచారు. అన్నిరకాల వాహనాలు తిరిగేందుకు మార్గాలను పూర్తిగా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేపట్టాలన్నారు.ఒక వైపు పర్యాటక కేంద్రం,మరో వైపు ఈ ఉక్కు కర్మాగారం చేపట్టడం ద్వారా రైతులకు మంచి జరగడమేకాకుండా, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నారు.సి.ఎం.డి మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి దీనిపై నిర్విరామంగా పర్యవేక్షణ జరుపుతున్నారన్నారు. స్పెషల్ డిసి 50 శాతం చైనా లో ఉందని అందుకు అక్కడకి అనుభవం గల బృందం ద్వారా అక్కడ ఉపయోగించే సాంకేతికత, తక్కువ కాలంలోనే పూర్తి చేయుటకు మంచి ఏజెన్సీ తీసుకోవడం ద్వారా త్వరగా అభివృద్ధి జరుగుతుందన్నారు. దీనిపై మంత్రి తప్పకుండా ముందుకు తీసుకపోవడంలో సందేహం లేదన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షేక్ మోహిదిన్,రూరల్ సిఐ ఉమామహేశ్వర రెడ్డి, మండల సర్వేయర్ ఇంద్రజ, స్థానిక ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.