
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు రూ.8 కోట్ల వరకూ ఉంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగానికి (ఏఐయూ) చెందిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టి భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణా కొరియాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు హాంకాంగ్ నుంచి చెన్నైకు వచ్చారు. ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ ప్రాంతానికి తరలిస్తున్నారనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.