'ఏ భాషలో నటించినా ముందుగా ఆ భాష నేర్చేసుకుంటాను' అంటోంది అందాలతార అనుపమ పరమేశ్వరన్. 'ఒక భాషలో సినిమా ఒప్పుకోగానే ముందుగా ఆ భాషలోని కొన్ని మంచి సినిమాలను వరుసగా చూస్తాను. ఆ తర్వాత సెట్స్ లో అందరితోనూ ఆ భాషలోనే మాట్లాడడం మొదలుపెడతాను. కొన్నాళ్లకే ఆ భాష వచ్చేస్తుంది. అలా భాష రావడం వల్ల నటన ఈజీ అవుతుంది' అని చెప్పింది అనుపమ.