చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఎమోషన్స్ సంగతి అలా ఉంచితే యాక్షన్ సీన్స్ అతిగా వున్నాయనే టాక్ వచ్చింది. ట్రైన్ సీన్ .. విలన్ ను కరిచి పామే చచ్చిపోవడం వంటి సీన్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ తరహా యాక్షన్ సీన్స్ వలన డామేజ్ ఎక్కువగా ఉందని గ్రహించిన టీమ్, ఆ సీన్స్ ను లేపేసి ఆలోచన చేస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ సీన్స్ ను తొలగించడం వలన కొంతవరకూ ఫలితం ఉండొచ్చునని భావిస్తున్నారట.