YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో క్షుద్ర తంతు

Highlights

  • అమావాస్య  వచ్చిందంటే చాలు
  • జంతుబలులు, శ్మశానంలో పూజలు
  • ఎముకలు, పుర్రెలను తింటూ పూనకం
  • హైటెక్‌ సీఎంకు  ఓ సవాల్
 కుప్పంలో క్షుద్ర తంతు

  హైటెక్‌ సీఎంగా చెప్పుకునే చంద్రబాబు.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో క్షుద్ర తంతు  రాజ్యమేలుతుంది. అమావాస్య  వచ్చిందంటే చాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్షుద్ర తంతుకు తెరలేస్తోంది. కొందరు అంధవిశ్వాసులు.. జంతుబలులు, శ్మశానంలో పూజలు లాంటి వాటిని ఆచారంగా కొనసాగిస్తున్నారు.శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా మూఢనమ్మకాలు మాత్రం మనిషిని వదలడంలేదు. ఏదో ఒక వంకతో... క్షుద్రపూజలు అంటూ వివిధ రూపాల్లో తమ మూఢనమ్మకాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు తాజాగా, చిత్తూరు జిల్లాలో ఇలాంటిదే ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడో కాదు.. సాక్షాత్తు హైటెక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం పట్టణంలోనే ఈ ఆచారం కొనసాగుతోంది. 
అమావాస్య రోజున వింత ఆచారం 
కుప్పం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ కాలనీలో శ్రీ ప్రసన్న అంగాళ్ల పరమేశ్వరీ ఆలయం ఉంది. ఇక్కడ మహాశివాత్రి తర్వాత వచ్చిన అమావాస్య రోజున వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు భక్తులు పూనకంతో ఊగిపోతూ.. అమ్మవారిని శ్మశాన కోళ్లకు ఆహ్వానించడం విడ్డూరం. వీరి పూనకాలు.. శివాళ్ల నడుమ.. అంగాళ్ల పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని.. జనం శ్మశానం దాకా వెళతారు. ఆ సందర్భంగా.. డప్పుల చప్పుళ్లతో.. నాట్యాలు.. పూనకాలకు లెక్కేలేదు. 

కుప్పం పట్టణంలో నివసించే తమిళులు.. శ్మశానకోళ్లు పేరిట ఏటా ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నరు. తమిళనాడులో సర్వసాధారణమైన తంతును ఇక్కడా జరుపుకుంటున్నారు. దాదాపు మూడేళ్లుగా ఇక్కడ స్మశాన కోళ్ల పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. 

శ్మశానంలో మట్టితో ఏర్పాటు చేసిన కాళికాదేవి ప్రతిమకు.. అంగాళ్ల పరమేశ్వరీ ఉత్సవ విగ్రహంతోపాటు ప్రదక్షిణలు చేసిన భక్తులు.. ఆ  తర్వాత అసలు తంతును ప్రారంభిస్తారు. అమ్మవారి గర్భగుడిలో ఉంచిన కొరడాతో దెబ్బలు వేయించుకుంటారు. ఇదేంట్రా అంటే.. దేహంలోని దెయ్యం పరారవుతుందంటూ నమ్మబలుకుతారు. చిన్న పెద్దా ఆడ మగా తేడాలేకుండా అందరూ కొరడా దెబ్బలకోసం క్యూ కట్టడం.. శాస్త్రసాంకేతిక వినువీధులకు చేరిన ఈ రోజుల్లో విస్మయాన్ని కలిగించక మానదు.  
ఇక తర్వాతి తంతు బొందలగడ్డలోని మానవకంకాలం నుండి తీసిన ఎముకలతో పాటు పుర్రెలను తింటూ పూనకంతో ఓ మహిళ ఊగిపోవడం... క్షుద్రపూజలను తలపించేలా జరిగే ఈ తంతు స్మశాన కోళ్లు కార్యక్రమంలో చివరి ఘట్టం. ఈ తంతుకు తరలివచ్చే భక్తులకు భారీ బందోబస్తునే ఏర్పాటు చేశారు పోలీసులు. రాకెట్‌ యుగంలో.. ఇలాంటి ఆదిమకాలం నాటి మూఢనమ్మకాలు రాజ్యమేలుతుండడాన్ని హేతువాదులు తప్పుబడుతున్నారు. 

 

Related Posts