YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవి కోడి పందాలు కావు.. రాజకీయ పందాలు!

 అవి  కోడి పందాలు కావు.. రాజకీయ పందాలు!

ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు పందాలకు పెట్టింది పేరుగా మారింది. సంక్రాంతి పండుగ రావడంతో కోళ్ల పందాలు జోరందుకున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని మారుమూల గ్రామాలు కోళ్ల పందాలకు వేదికగా మారాయి. ఇక పట్టణాల్లో అయితే ఈ జోరు మరి ఎక్కువగా ఉంది. కోట్లాది రూపాయలు కోడి పందాల రూపంలో చేతులు మారుతున్నాయి అంటున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న పందాల జోరు. ఇక లోపల మాత్రం రాజకీయ పందాల హోరు ఎక్కువైంది. మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పందాలకు తలుపులు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పందాల ప్రదేశ్ గా మారింది. రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎక్కువ మంది పందేలు కాస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అధికార తెలుగుదేశం పార్టీదే విజయమని పందాలు కట్టడం విశేషం.ఇక ఈ మధ్యనే యాక్టివ్ అయిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని కొందరు పందెం కాస్తున్నారు. అయితే ఈ పార్టీపై పెద్దగా పందేలు కాస్తున్నట్లు కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ కోట్లాది రూపాయలు పందెం కాస్తున్నారు అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకు పోరాడుతారని - ఆయన గెలుపు సాధ్యమేనని కొందరు ధీమాగా ఉన్నారు. అలాంటి వారందరూ తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని పందేలు కాస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కోడి పందాల కే కాదు ఈ పందాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని రాజకీయ పండితుల విశ్లేషణ. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వామపక్షాల గెలుపుపై ఏ ఒక్కరు పందాలు కాసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇక్కడ కూడా పొత్తులు ఖరారైన తర్వాత ఈ పార్టీలపై కూడా పందాలు కాసే అవకాశాలున్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు కుదిరితే అప్పుడు ఆ పొత్తుపై కొందరు పందాలు కాయవచచ్చునని అంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వామపక్షాలకు మధ్య పొత్తు ఖాయమైతే ఆ పొత్తుపై కూడా పందాాలు కాసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ రెండు పార్టీలపై మాత్రం ఏ ఒక్కరూ పందాలు కాసే అవకాశాలే లేవంటున్నారు.

Related Posts